ఎయిరిండియా కస్టమర్లకు వెల్​కమ్.. రతన్ టాటా స్పెషల్ మెసేజ్

18 సెకండ్ల వాయిస్ మెసేజ్ ను పోస్ట్ చేసిన ఎయిరిండియా

హైదరాబాద్ : దాదాపు 7 దశాబ్దాల తర్వాత ఎయిరిండియా మళ్లీ పుట్టినింటికే వచ్చేసింది. ఇన్నాళ్లూ ప్రభుత్వ అధీనంలో ఉన్న ఎయిరిండియా సంస్థ.. గత గురువారం (జనవరి 27న) టాటాల చేతికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రయాణికులకు టాటా సన్స్ గౌరవ (ఇమెరిటస్) చైర్మన్ రతన్ టాటా తొలిసారి ఓ స్పెషల్ సందేశాన్నిచ్చారు. ఆయన మాట్లాడిన 18 క్షణాల వాయిస్ మెసేజ్ ను ఎయిరిండియా తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.

‘‘ఎయిరిండియా కొత్త కస్టమర్లకు స్వాగతం’’ అంటూ ఆయన మొదలుపెట్టారు. ప్రయాణికుల సౌలభ్యం, సేవల్లో ఎయిరిండియానే ప్రతి ఒక్కరి చాయిస్ అయ్యేలా సంస్థను అభివృద్ధి పథంలో నడపడం కోసం మీ అందరితో కలిసి పనిచేసేందుకు ఎంతో ఉత్సుకతతో ఎదురు చూస్తున్నామంటూ ఆయన పేర్కొన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/