బాహుబలి దోశె

రుచి: వెరైటీ వంటకాలు ‘చెలి’ పాఠకుల కోసం

Variety Dosa

దోశె అనగానే మనకు నోరు ఊరిపోతుంది. అందులో మసలా, ఉల్లిపాయలు ఇలా పలురకాల దోశెలు మనకు తెలుసు. దాదాపు వందకుపైగా దోశెలున్నాయంటే మీరు నమ్ముతారా?

అసలు రోజూ పెట్టినా బోర్‌ కొట్టని టిఫిన్‌ ఏదీ అంటే టక్కున చెప్పే పేరు దోశె.

అందులోనూ మినపట్టు రుచే వేరు. ఎన్నిరకాల దోశలున్నా ఎవర్‌గ్రీన్‌ అదే. అంత డిమాండ్‌ ఉంటుంది కాబట్టి ఆ దోశెకు ఎప్పటికపుడు రకరకాల హంగులద్ది వినయోగదారుల్ని ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తుంటాయి హోటళ్లు.

చీజ్‌దోశె , పనీర్‌ దోశె, ఎగ్‌ దోశె అంటూ దోశల్లో వందకుపైగా రుచులొచ్చాయంటేనే ఆ విషయాన్ని అర్ధం చేసుకోవచ్చు. ఇక ఇప్పుడేమో బాహుబలి దోశలు ట్రెండ్‌ అయిపోయాయి.

అంటే ఏదో ఒకరకం రుచి ఉన్న దోశెకు ఆ పేరు పెట్టడం కాదండో§్‌ు. ఈ దోశెని పట్టుకోవాలంటే బాహుబలైనా రెండు చేతులూ చాచాల్సిందే. అంత పొడవ్ఞంటాయి.

వీటినే కొన్నిచోట్ల మూడడుగుల లేదా నాలుగడుగుల దోశెలన కూడా అంటున్నారు.

టేబుల్‌ అంత పొడవైన పెనం మీద మూడునాలుగు పెద్దపెద్ద దోశెల్ని ఒకదానికి ఒకటి అతుక్కునేలా పొయ్యడం ద్వారానూ ఈ మూల నుంచి ఆ మూలకి ఒకే దోశెగానూ కూడా ఈ బాహుబలి దోశల్ని వేస్తున్నారు.

అన్నట్లూ హోటల్‌కెళ్లి మామూలుగా ప్లేట్‌ దోశె అని అడుగుతుంటాం కదా కానీ ఈ దోశె ఒక్కటి పెట్టాలంటే మామూలు ప్లేట్లు నాలుగైదింటిని వరుసగా పేర్చాలి లేదా బాహుబలి ప్లేటు తేవాల్సిందే. తినడం కూడా ఒక్కరికి కష్టమే.

ఇద్దరు ముగ్గురు కుటుంబసభ్యులు వెళ్లినపుడు ఒక్కటి ఆర్డరిస్తే అందరికీ సరిపోతుంది. ఫ్యామిలీ దోశె అన్నమాట.

హైదరాబాద్‌లోని చట్నీస్‌, సుజనాఫోరం మాల్‌లోని దోశ ఎంపైర్‌.. లాంటి హోటళ్లతో పాటు దేశంలోని ఇతర నగరాల్లోనూ అంతర్జాతయంగా కూడా హోటళ్లలో ప్రస్తుతం ఈ పొడవైన దోశెలు అందరినీ ఆకర్షిస్తున్నాయి.

ఇక, కుర్రకారు స్నేహితులతో సరదాగా బయటికెళ్తే ఇష్టమైన మీటింగ్‌ఓటు పిజ్జాహట్‌లే. కబుర్లు చెప్పుకుంటూ పిజ్జాలు తింటూ ఎప్పుడూ వాళ్లని వాళ్లే ఎన్ని సెల్ఫీలు తీసుకుంటారు.

ఇవి కూడా ఇంచుమిం చు చిన్నటేబుల్‌ అంత ఉంటున్నాయి. వీటిని ఒక్క ముక్క, మామూలు పిజ్జా అంత ఉంటుంది.

అంటే ఒక్కటి ఆర్డరిస్తే టేబుల్‌ చుట్టూ కూర్చున్న ఫ్రెండ్స్‌ గ్యాంగ్‌ అంతా తినేయొచ్చున్నమాట. చూస్తుంటే రెండు కళ్లూ సరిపోవడం లేదు కదూ.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/