శ్రీమద్రామాయణం

ఆధ్యాత్మిక చింతన

Srimadramayanam
Srimadramayanam

నేను రాక్షసస్త్రీని. నా పేరు శూర్పణఖ. కామరూపవిద్యలు తెలిసిన దాన్ని. నేను ఏ రూపం కావాలనుకున్నా చిటికలో ఆ రూపాన్ని పొందగలను. రావణుడనే రాోసరాజు నాకు సోదరుడు.

కుంభకర్ణుడు, విభీషణుడు, ఖరదూషణులు నా సోదరులే. నేను నిన్ను మోహించాను. మనిద్దరం కలిసి ఈ దండకారణ్యం అంతా విహరిద్దాం అని శ్రీరాముని కోరుతుంది తాటకి. శ్రీరాముడు ఒప్పుకోడు, లక్ష్మణుని వద్దకు ఆమెను పంపుతాడు. లక్ష్మణునితోను ఆమె అలాగే చెబుతుంది.

తన కోరిక తీర్చుకోవాలని మొండిపట్టు పడుతుంది. లక్ష్మణుడు ఆమె ముక్కు, చెవ్ఞలను కోసి పంపిస్తాడు. ఆమెను చూసి ఖరుడు ‘నీకు ఈవిధంగా అంగవైకల్యాన్ని, దురవస్థను కల్గించిందెవరు? అని అడిగి తెలిసికొని కోపంగా రామలక్ష్మణులపైకి యుద్ధానికి పోయి చస్తాడు. అంతేకాదు తన పద్నాలుగా వేలమంది అనుచరులు కూడా చస్తారు. తాటకి రావణాసురుని దగ్గరకు పోతుంది. రామ, లక్ష్మణులను గురించి ఎప్పి రాముని భార్య సీత, ఆమె చాలా అందమైనది.

‘ ఆ సీతను నీకు భార్యగా చేయాలని అనుకున్నాను. క్రూరుడైన లక్ష్మణుడు ముక్కు, చెవ్ఞలుకోసి నన్ను కురూపినిగా చేశాడు అని ఎబుతుంది (పుట-333 అరణ్యకాండము-శ్రీమద్రామాయణము), రావణాసురునికి శ్రీరామునిపట్ల కోపం కల్గలేదుగానీ, సీతపట్ల కామం కల్గింది. సర్వనాశనమైపోయాడు రావణుడు, వాని రాజ్యం.

ఇది మనకు రామాయణం నుంచి తెలిసే విషయం. ఇక మనం ‘ఇదంతా నిజంగా జరిగిన కథనా? తాటకి కామరూపిణి కదా ఈ రూపంలో నున్న ముక్కు, చెవ్ఞలను కోసేస్తే ఏమవ్ఞతుంది? మరొక అందమైన రూపాన్ని పొందవచ్చుకదా? ఏంటో అర్ధం-పర్థం, తల-తోక లేని కథ ఇది. అయినా తాటకి రాక్షస స్త్రీ ఏదో కోరింది.

ఆ మాత్రం దానికే ఆమె ముక్కు-చెవ్ఞలను కోసేసే రామలక్ష్మణులు అవతార పురుషులు, దర్శపురుషులు ఎలా అవ్ఞతారు? అని ప్రశ్నిస్తూ కూర్చుంటే రామునికిగనీ, రామాయణానికిగానీ వచ్చే నష్టం ఏవిూలేదుగానీ ఒక మంచి పాఠాన్ని నేర్చుకోగలిగే అవకాశాన్ని మనం కోల్పోతాం.

అర్హతకు మించి కోరరాని కోరికను కరితే (భగవంతుడిని కోరినా) మనకు కష్టాలు, నష్టాలు కల్గుతాయనే నీతి ఒకటి ఉందా ఈ శూర్పణఖ కథలో.ఇక వికృత రూపంతో వ్ఞన్న ఆమెను చూసి నీకు ఈ విధంగా దురవస్థను కల్గించింది ‘ఎవరు? అని ఖరుడు అడిగాడుగానీ ‘వానిక అంత కోపం ఆవటానికి ‘నీవేమి చేశావ్ఞ? అని అడగలేదు. అసలైన కారణం తెలిసికోక కోపానికిలోనై చావ్ఞను కొని తెచ్చుకున్నాడు వాడు.

ఇక రావణాసురుడు అందమైన సీతను నీకు భార్యగా చేయదలచి ఈ దురవస్థను తెచ్చుకొన్నాను అని శూర్పణఖ చెపితే కామానికి లోనయ్యాడుగానీ ఆమె మాటల్లోని నిజానిజాలను తెలుసుకునే ప్రయత్నం చేయలేదు, నాశనమైపోయాడు.

సరైన కారణాన్ని తెలుసుకోకపోతే, నిజానిజాల నిర్ధారణ చేయక కామక్రోధాలకు వశమైతే నాశనం తప్పదని మనం గ్రహించి జీవించకపోతే బుద్ధి హీనులమే.

– రాచమడుగు శ్రీనివాసులు

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/