ఐబ్రోజెల్‌గా పెట్రోలియం జెల్లీ!

పెట్రోలియం జెల్లీని కేవలం పెదాలు తేమగా ఉండటానికో, చర్మానికి మాయిశ్చరైజర్‌లానో వాడటం తెలిసిందే. అయితే దాన్ని మరిన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు.

ఐబ్రోజెల్‌గా పెట్రోలియం జెల్లీ!
Eyebrow shades

దీన్ని ఐబ్రో జెల్‌గా కూడా వాడుకోవచ్చు. దీన్ని రాయడం వల్ల కనుబొమలు ఓ ఆకృతిలో కనిపిస్తాయి. అలాగే కనుబొమలు మెరవాలన్నా కూడా కొద్దిగా పెట్రోలియం జెల్లీ రాసి చూడండి. దీనికి చర్మాన్ని సాంత్వన పరిచే గుణం ఉంది. కాబట్టి పగిలిన పాదాలకు, పొడిబారిన మోచేతులు, మోకాళ్లకు రాయాలి. రోజు నిద్రపోయే ముందు ఇలా చేయడం వల్ల చర్మానికి కావాల్సిన తేమ అందుతుంది. కొంతమండిలో గోళ్లు తరచూ పెళుసుబారి విరిగిపోతుంటాయి.

అలా కాకుండా ఉండాలంటే రోజూ వాటికి పెట్రోలియం జెల్లీ రాసి మృదువుగా మర్దనా చేయాలి. మేకప్‌ తీసేయడానికి కూడా ఇది చక్కగా ఉపయోగపడుతుంది. దూది ఉండను జెల్లీలో ముంచి నెమ్మదిగా ముఖంపై ఉండే మేకప్‌ను తొలగించవచ్చు.

పెదవులకు వేసుకున్న లిప్‌స్టిక్‌ కొన్నిసార్లు దంతాలకు అంటుకుంటుంది. అలా కాకుండా ఉండాలంటే వాటిపై కూడా చాలా కొద్దిగా పెట్రోలియం జెల్లీ రాస్తే చాలు.

తాజా ‘నాడి వ్యాసాల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/health1/