అదిరేట్టు పంచెకట్టు..!

చిన్నారుల డ్రెస్‌లు

Fashion Fashion

ఆడపిల్లలకు ఓణీల పేరంటం చేసినట్లే మగపిల్లలకి పదకొండు, పదమూడో ఏట పంచెల వేడుక చేశాకే పంచె కట్టుకోవడం అనేది ఉండేది. కానీ ఇప్పుడు ఆ సంప్రదాయాన్ని పక్కనపెట్టి మొదటి పుట్టిన రోజుకే పంచెని తొడిగేస్తున్నారు. దీంతో పిల్లల పంచెల సెట్లలో లెక్కలేనన్ని రంగులూ డిజైన్లూ వస్తున్నాయి.

ఇప్పుడంటే పంచెకట్టు అనేది వేడుకలకి సంబంధించిన ట్రెండీ డ్రెస్‌లా కనిపిస్తుంది కానీ, ఒకప్పుడు ఫార్మల్‌, క్యాజువల్‌, ఫెస్టివల్‌ వేర్‌ ఏదైనా అదొక్కటే. కాకపోతే సందర్భాన్ని బట్టి కట్టుకునే పంచెల్లో సాదా, జరీ అంచులూ ముతకదా, మెత్తని ఖద్దరా అన్న తేడా మాత్రమే కనిపించేది.

అప్పట్లో పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా రైతులు, కూలీలు, ఉద్యోగులు, నాయకులు, అధికారులు అందరూ పంచెకట్టులోనే ఉండేవారు. పాశ్చాత్యసంస్కృతి పుణ్యమా అని ప్యాంటు అలవాటై, పంచెకట్టుకోవడాన్ని దాదాపు మరిచిపోయారు.

కానీ పాతతరం మాత్రం నేటికీ పంచెకట్టుని వీడలేదనే చెప్పాలి. తెల్లని పంచె, తెల్లని లాల్చీ వేసుకుని దానిమీద జరీ అంచుకండువా వేసుకుని కపినించే తాతయ్యలు ఇంటింటా కనిపిస్తూనే ఉంటారు. గుడుల్లో పూజారులంతా పంచె కట్టుకునే పూజలు చేస్తుంటారు.

జైనులు గుడికి వెళ్లేప్పుడు పంచెనే కడతారు. చీరకట్టులానే పంచెకట్టు కూడా ప్రాంతాన్ని బట్టి మారుతుంటుంది. దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు,కేరళల్లో అడ్డపంచెకట్టు కనిపిస్తే, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రం కుచ్చిళ్లతో ఉంే కట్టే ఎక్కువగా కనిపిస్తుంటుంది.

రాజస్థానీ, గుజరాతీ, మహారాష్ట్ర ధోతీ కూడా ఇంచుమించు తెలుగువారి పంచెలానే ఉంటుంది. నడవడానికి ఎలాంటి ఇబ్బందీ లేకుండా మోకాళ్లపైకి మడిచి కట్టే గాంధీజీ పంచెకట్టుని కాపీ కొట్టే ధైర్యం మాత్రం ఇంతవరకూ ఎవరూ చేయలేదనే చెప్పాలి.

పొలాల్లో పనిచేసే రైతులూ రైతుకూలీలు తప్ప. పంచెనే ధోలీ, ధోవతి, అంగోస్త్ర అని అంటారు.

ఏకవస్త్రాన్ని తీసుకుని, ఒక అంచుని ఓ పక్కకిముడేసి, మిగిలినదంతా కుచ్చిళ్లు పెట్టి వాటినిందువైపు దోపి, కాళ్లమధ్యలోంచి ఓ అంచుని గోచీమాదిరిగా వెనక్కి దోపడం అనేది పూర్వకాలం నుంచీ ఉంది.

పైగా పంచె అనేది కేవం పురుషుల అంగవస్త్రం అని చెప్పలేం. ఆంధ్రప్రదేశ్‌ లోని అమరావతిలో క్రీ.పూ. మొదటి శతాబ్దం నాటి పంచె కట్టుకున్న చక్రావతి అనే స్త్రీ శిల్పమే నేటి మరాఠా సంప్రదాయ చీరకట్టు సైతం కొంత పంచెకట్టునే తలపిస్తుంది.

ప్యాంటులో లేని సౌలభ్యం పంచెలో ఉంటుంది.అదీ నేతవి కట్టుకుంటే వేసవిలో చక్కగా గాలాడుతుంటుంది. కొత్తదనమో సౌకర్యమో సినీ ప్రభావమో తెలీదుకానీ, ఒకప్పుడు మనదైన సంప్రదాయ పంచెకట్టు.

నేడు వేడుకల్లో ధరించే ఫ్యాషన్‌ కట్‌గా మారి, అంతర్జాతీయ ఫ్యాషన్‌ షోల్లోనూ కనిపిస్తోంది. మొత్తమ్మీద ఆనాటి అంగోస్త్రాన్ని సరికొత్త ట్రెండ్‌గా ఫీలై ఆనందంగా ధరస్తోందీ తరం.

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/