కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ అసెంబ్లీ ముందు ఆటోడ్రైవర్ ఆత్మహత్యాయత్నం

అసెంబ్లీ ముందు ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకునేందుకు ట్రై చేయడం అందరిని భయబ్రాంతులకు గురిచేసింది. సోమవారం ఉదయం రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైయ్యాయి. ప్రారంభమైన కాసేపటికే.. ఓ వ్యక్తి అసెంబ్లీ ఎంట్రన్స్ గేట్ ముందుకు ఆటోలో వచ్చి.. ఒంటిపై కిరోసిన్ పోసుకొని.. హోంమంత్రి మహమూద్ అలీ డౌన్ డౌన్, కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ అసెంబ్లీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఇది గమనించిన పోలీసులు వెంటనే అడ్డుకొని అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి వచ్చిన ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎందుకు ఆత్మహత్య యత్నం చేసుకోబోయాడనే వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటన తో అక్కడి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.

మరోపక్క టీఆర్ఎస్ సర్కార్ కు రైతులపట్ల చిత్తశుద్ధి ఉంటే వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ.. గాంధీ భవన్ నుంచి అసెంబ్లీ వరకు గుర్రపు బండి మీద వచ్చారు కాంగ్రెస్ నేతలు. అసెంబ్లీ గేటు దగ్గర కాంగ్రెస్ నేతలను అడ్డుకున్నారు పోలీసులు.