ఉపాసనకు చిన్న పాటి సీమంతం చేసిన స్నేహతులు

మెగా కోడలు ఉపాసన కు చిన్నపాటి సీమంతం చేసారు ఆమె స్నేహితులు. ఉపాసన తల్లి కాబోతుందనే విషయం మెగా అభిమానులను సంతోషానికి గురి చేసిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో కొంతమంది ఉపాసన సరోగసి ద్వారానే ఉపాస‌న బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌నుందంటూ ప్రచారం చేసారు. అయితే ఈ వార్తలో ఏమాత్రం నిజం లేదని తేల్చింది ఉపాసన. తన సోషల్ మీడియా పేజీ లో బేబి బంప్‌తో ఉన్న ఫొటోల‌ను షేర్ చేసింది.

ఇదిలా ఉంటె రామ్ చరణ్ దంపతులకు చిన్న సర్ ప్రైజ్ ఇచ్చారు ఉపాసన స్నేహితులు. చరణ్ ఇంటికి వెళ్లి ఉపాసనకు చిన్న పాటి సీమంతం చేశారు. ఈ సందర్భంగా ఉపాసన మెడలో పూలదండ వేసి పలు బహమతులు అందించారు. ఈ ఫొటోలను బేబీ కమింగ్ సూన్ అంటూ తన ఇన్ స్టా స్టోరీస్ లో షేర్ చేసుకుంది ఉపాసన. అలాగే ఉపాసన స్నేహితులు కూడా బేబీ షవర్ ఫొటోలను ట్విట్టర్లో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.