మృతుల కుటుంబాలకు తక్షణమే రూ. 5 లక్షల సాయం అందించాలి

గులాబ్ తుపాను కారణంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు
తుపాను బాధిత జిల్లాల కలెక్టర్లతో సీఎం సమీక్ష

అమరావతి: గులాబ్ తుపాను కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్ తుపానుపై సమీక్ష నిర్వహించారు. తుపాను ప్రభావిత ప్రాంతాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లతో ఆయన మాట్లాడారు. వర్షం తగ్గుముఖం పట్టిన వెంటనే… విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిన ప్రాంతాల్లో పునరుద్ధరించే ప్రయత్నం చేయాలని జగన్ చెప్పారు. తుపాను కారణంగా మృతి చెందిన కుటుంబాలకు తక్షణమే రూ. 5 లక్షల సాయాన్ని అందించాలని ఆదేశాలు జారీ చేశారు. వరద బాధిత ప్రాంతాల్లో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని చెప్పారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ కు సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, మంత్రి ధర్మాన కృష్ణదాస్ కూడా హాజరయ్యారు. సీఎస్ ఆదిత్య నాథ్ దాస్ ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షించాలని సీఎస్ ను ముఖ్యమంత్రి ఆదేశించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/