పిఠాపురంలో సాయి ధరమ్ తేజ్‌ పై కూల్ డ్రిక్స్ బాటిల్స్ తో దాడి..

సినీ నటుడు , పవన్ కళ్యాణ్ మేనళ్లుడు సాయి ధరమ్ తేజ్ పై కొంతమంది ఆకతాయిలు కూల్ డ్రిక్స్ బాటిల్స్ తో దాడి చేసారు. కానీ ఈ దాడిలో ఆయన తప్పించుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన పిఠాపురంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది.

ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న ఉద్రిక్తత ఘటనలు చోటుచేసుకున్నాయి. అధికార పార్టీ కి చెందిన నేతలు , వర్గీయులు ప్రతిపక్ష పార్టీ నేతల ఫై దాడులకు పాల్పడుతున్నారు. రీసెంట్ గా మచిలీపట్నంలో జనసేన నేత కర్రి మహేష్ ఇంటిపై వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరుల దాడికి పాల్పడగా..నిన్న బిజెపి అభ్యర్థి సీఎం రమేష్ ఫై దాడికి పాల్పడ్డారు.

ఈరోజు జనసేన పార్టీ ప్రచారంలో పాల్గొన్న సాయి ధరమ్ తేజ్ ఫై దాడి చేసారు. తాటిపర్తిలో ప్రచారం చేస్తుండగా..కొంతమంది ఆకతాయిలు తేజ్ ఫై కూల్ డ్రిక్స్ బాటిల్స్ విసిరారు. ఈ క్రమంలో తేజు తప్పుకోవడం తో ఆయన పక్కనే ఉన్న జనసేన వీరాభిమాని నల్ల శ్రీధర్‌కు ఆ బాటిల్ తగిలింది. దీంతో.. అతని కంటిపై గాయమై, తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే నేతలు , అభిమానులు దాడికి పాల్పడిన వారిని వెతికారు కానీ చీకట్లో కనిపించలేదు. ఇది వైసీపీ స్థానిక నేతల పనే అయ్యుండొచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.