నేడు బిజెపి తీర్థం పుచ్చుకోబోతున్న కాంగ్రెస్ మాజీ నేత అశోక్ చవాన్!

ప్రకటించిన ముంబయి బిజెపి కార్యాలయం

ashok-chavan-to-join-bjp-today

న్యూఢిల్లీః కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి షాకిచ్చిన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ నేడు బిజెపి తీర్థం పుచ్చుకోబోతున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆయన బిజెపిలో చేరుతారని ముంబయి బిజెపి కార్యాలయం ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన చవాన్ బిజెపిలో చేరుతారన్న ఊహగానాలు మొదలయ్యాయి. అవి నేడు నిజం కాబోతున్నాయి. కాంగ్రెస్‌కు రాజీనామా తర్వాత బిజెపిలో చేరబోతున్నారా? అన్న ప్రశ్నకు ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని నిన్న ప్రకటించిన చవాన్.. తాజాగా కాషాయ కండువా కప్పుకోవడానికి రెడీ అవుతున్నారు.

ఇదిలావుంచితే, మహరాష్ట్రలో కాంగ్రెస్‌కు వరుస కష్టాలు ఎదురవుతున్నాయి. సీనియర్ నేతలు బాబా సిద్దిఖీ, మిలింద్ డియోరా వంటివ నేతలు ఇప్పటికే పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. ఇప్పుడు అశోక్ చవాన్ కూడా వెళ్లిపోవడం మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బగానే చెప్పాలి. కాగా, పార్టీని వీడాలన్న నిర్ణయం తన వ్యక్తిగతమని అశోక్ చవాన్ తెలిపారు.