ధనుష్ – శేఖర్ కమ్ముల మూవీ ప్రారంభం

ధనుష్ – శేఖర్ కమ్ముల కలయికలో తెరకెక్కబోయే మూవీ సోమవారం అట్టహాసంగా ప్రారంభమైంది. లవ్ స్టార్ తర్వాత శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. ఇటీవల కాలంలో తెలుగు డైరెక్టర్స్ తో సినిమాలు చేసేందుకు తమిళ్ హీరోలు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటీకే సూర్య ,కార్తీ , విజయ్ వంటి వారు తెలుగు డైరెక్టర్స్ తో వర్క్ చేయగా..ఇక ధనుష్ కూడా ప్రస్తుతం తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి డైరెక్షన్లో సార్ అనే మూవీ చేస్తున్నాడు. తెలుగు , తమిళ్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో ధనుష్ స్కూల్ మాస్టర్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, ఫస్ట్ సింగిల్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఈ సినిమా సెట్స్ ఫై ఉండగానే ధనుష్ మరో తెలుగు డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చాడు. గోదావరి , హ్యాపీ డేస్ , ఆనంద్, లవ్ స్టోరీ వంటి కూల్ మూవీస్ తో కూల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల డైరెక్షన్లో ఓ సినిమా చేయబోతున్నాడు. హైదరాబాద్‌లో ఘనంగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ‘లవ్‌స్టోరి’ వంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత శేఖర్‌ కమ్ముల తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని ఏషియన్‌ సినిమాస్‌ బ్యానర్‌పై సునీల్ నారంగ్‌, పుస్కూరి రామ్‌మోహన్‌ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ధనుష్‌కు జోడీగా సాయిపల్లవి నటించనున్నట్లు సమాచారం. త్వరలోనే షూటింగ్‌ ప్రారంభించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.