రాకేష్ మృతి పట్ల రేపు నర్సంపేట బంద్ కు పిలుపునిచ్చిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి

సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌లో శుక్ర‌వారం ఆర్పీఎఫ్ జ‌రిపిన‌ కాల్పుల్లో వ‌రంగ‌ల్ జిల్లా ఖానాపురం మండ‌లం ద‌బీర్‌పేట‌కు చెందిన రాకేశ్‌ మృతి చెందిన సంగతి తెలిసిందే. రాకేష్ మృతి పట్ల రేపు నర్సంపేట బంద్ కు పిలుపునిచ్చారు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి. ఈ బంద్ కు పెద్ద సంఖ్య లో హాజరు కావాలని పిలుపునిచ్చారు.

కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ కు నిరసనగా ఈరోజు ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద పెద్ద ఎత్తున ఆర్మీ విద్యార్థులు చేరుకొని హింసాత్మక ఘటనలు చేసారు. రైళ్లు తగలపెట్టారు. స్టేషన్ ను పూర్తిగా ధ్వసం చేసారు. ఈ క్రమంలో పోలీసులు ఆందోళనను అదుపు చేసేందుకు లాఠీఛార్జ్ చేయగా, పోలీసుల ఫై రాళ్ల దాడి చేసారు. దీంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో వరంగల్ జిల్లాకు చెందిన దామోదర రాకేష్ మరణించాడు. అలాగే మరో 13 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం గాంధీ హాస్పటల్ లో వీరికి చికిత్స అందిస్తున్నారు. ఇక పోలీసులు దాదాపు 200 మందిని అదుపులోకి తీసుకొని ఈ ఘటన ఫై విచారిస్తున్నారు. అంతమంది ఒకే సారి ఎలా వచ్చారు..? ఎవరు ప్లాన్ చేసారు..? అనే కోణంలో విచారిస్తున్నారు.

మరోపక్క రాకేష్ స్వగ్రామం ఖానాపురం మండంలోని దబీర్ పేట లో విషాద ఛాయలు అల్లుకున్నాయి. రాకేష్ తండ్రి కుమారస్వామి వ్యవసాయదారుడు. రాకేష్ కు ఇద్దరు తోబుట్టువులు ఉన్నారు. అతడి సోదరి సైన్యంలో పనిచేస్తున్నారు. కాగా, రాకేష్ వయసు 18 సంవత్సరాలు. నర్సంపేటలో డిగ్రీ పూర్తిచేశాడు. రాకేష్ మృతి తెలుసుకొని బంధువులు, గ్రామస్థులు అతడి ఇంటికి తరలివస్తున్నారు. రాకేష్ కుటుంబ సభ్యులతో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడారు. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.