టీచర్లతో పాటు పాఠశాలల సిబ్బందికీ టీకాలు

అధికారులకు సీఎం ఆదేశాలు

అమరావతి : వ్యాక్సినేషన్ విషయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పాఠశాలలను ఓపెన్ చేయాలన్న డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ఉపాధ్యాయులతో పాటు పాఠశాలల్లో పనిచేసే సిబ్బందికీ కరోనా టీకాలు వేయాల్సిందిగా అధికారులను ఆయన ఆదేశించారు. గ్రామం యూనిట్ గా వ్యాక్సిన్లు వేయాలని సూచించారు. ప్రాధాన్య క్రమంలో వ్యాక్సిన్లు వేయడానికి వీలవుతుందని చెప్పారు. ఇవాళ ఆయన వ్యాక్సినేషన్ కార్యక్రమంపై సమీక్ష చేశారు. 18–44 ఏళ్ల వారికి టీకాలు వేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రజల దగ్గరకు వెళ్లే ఉద్యోగులు, అధికారులు, సిబ్బంది అందరికీ టీకాలు వేయాలన్నారు. వ్యాక్సిన్లను ఎక్కువగా వేస్ట్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కుటుంబ సభ్యుల వివరాలను ఆరోగ్యశ్రీ కార్డులో క్యూఆర్ కోడ్ రూపంలో నమోదు చేయాలన్నారు. ఆ కోడ్ ను స్కాన్ చేయగానే వారి వివరాలు వచ్చేలా చూడాలన్నారు. ఆరోగ్య శ్రీ కార్డును ఆధార్ తో అనుసంధానించాలని సూచించారు. గ్రామాల్లోని క్లినిక్ ల నుంచి బోధనాసుపత్రుల దాకా జిల్లాను యూనిట్ గా తీసుకుని నియామకాలను చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/