ఏపి ఎన్నికలు.. ముగ్గురు ప్రత్యేక పరిశీలకుల నియామకం

AP Elections.. Appointment of three special observers

అమరావతిః ఏపీలో మే 13న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించింది. ప్రత్యేక పోలీసు పరిశీలకుడిగా దీపక్ మిశ్రా, ప్రత్యేక సాధారణ ఎన్నికల అబ్జర్వర్ గా రామ్ మోహన్ మిశ్రా, ప్రత్యేక ఎన్నికల వ్యయం పరిశీలకుడిగా నీనా నిగమ్ ను నియమిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది.

కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 16న ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అదే రోజు నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఇప్పుడు ఏపీకి ముగ్గురు స్పెషల్ అబ్జర్వర్లను కూడా నియమించిన నేపథ్యంలో, కేంద్రం ఏపీపై ప్రత్యేకంగా దృష్టి సారించిన విషయం అర్థమవుతోంది.