కేసులో అరెస్టయిన సీఎంను తొలగించాలని ఎక్కడుందిః ఢిల్లీ హైకోర్టు

Delhi High Court
Delhi High Court

న్యూఢిల్లీః ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ హైకోర్టు స్వల్ప ఊరటనిచ్చింది. మద్యం పాలసీ కేసులో అరెస్టయిన కేజ్రీవాల్‌ను సీఎం పదవి నుంచి తప్పించాలని దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. సుర్జీత్‌ సింగ్‌ యాదవ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సీఎం పదవి నుంచి ఆయనను తప్పించాలని డిమాండ్‌ చేశారు. కేజ్రీవాల్‌ ఏ అధికారి కింద సీఎంగా కొనసాగుతున్నారో వివరించాలని కేంద్ర ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ, ఢిల్లీ ప్రభుత్వం, లెఫ్టినెంట్‌ గవర్నర్‌లను వివరణ కోరాలని పిటిషనర్‌ కోరారు.

ఆర్థిక కుంభకోణానికి పాల్పడిన ముఖ్యమంత్రిని పదవిలో కొనసాగనివ్వకూడదని పిటిషనర్‌ సుర్జిత్‌ యాదవ్‌ పేర్కొన్నారు. కేజ్రీవాల్‌ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగడం న్యాయ ప్రక్రియకు ఆటంకాలు కలుగుతుందని.. దాంతో న్యాయ ప్రక్రియను అడ్డుకోవడమే మాత్రమే కాకుండా రాజ్యాంగ వ్యవస్థను కూడా విచ్ఛిన్నం చేస్తుందని ఆయన ఆరోపించారు. అయితే, కేజ్రీవాల్‌ను సీఎం పదవి నుంచి తప్పించలేమని.. జైలు నుంచి పాలన కొనసాగించడాన్ని అడ్డుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌ అరోరా నేతృత్వంలోని ద్విసభ్య బెంచ్‌ పిటిషన్‌ను పిటిషన్‌ను తిరస్కరించింది.