ఏపిలో మరో 1,178 మందికి కరోనా పాజిటివ్‌

మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 21,197

coronavirus -ap

అమరావతి: ఏపిలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. కొత్తగా 1155 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటితో పాటు ఇతర దేశాల నుంచి వచ్చిన ఒకరికి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 22 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 16,238 శాంపిల్స్‌ను పరీక్షించగా 1178 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 21,197కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని క్షేమంగా 762 మంది డిశ్చార్జ్‌ కాగా, 13 మంది మరణించారు. ఇప్పటి వరకు కరోనా బారిన పడి రాష్ట్రంలో 252 మంది మృతిచెందారు. ఇప్పటి వరకు ఏపీలో 10,50,090 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.  ప్రస్తుతం 11,200 మంది చికిత్స పొందుతున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/