పాక్‌-చైనాకు వ్యతిరేకంగా పీవోకేలో నిరసనలు

నీలం, జీలం న‌దుల‌పై ఆన‌క‌ట్ట‌ల నిర్మాణం వద్దని వాదన

Anti-China protests held in PoK against illegal construction

శ్రీనగర్‌: పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్(పీవోకే)లోని ముజ‌ఫ‌రాబాద్ వాసులు ఆందోళనలకు దిగారు. నీలం, జీలం న‌దుల‌పై ఆన‌క‌ట్ట‌ల నిర్మాణాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. చైనా, పాక్ ఎకనామిక్ కారిడార్ కింద‌ నిర్మిస్తోన్న ఈ ప్రాజెక్టుల వల్ల ప‌ర్యావ‌ర‌ణానికి కూడా నష్టం వాటిల్లుతుందని వారు అంటున్నారు. ఆయా న‌దుల‌పై నిర్మాణాల కోసం చైనా, పాకిస్థాన్‌ ఏ చ‌ట్టం కింద ఒప్పందం చేసుకున్నాయని వారు నిలదీస్తున్నారు. ఇరు దేశాలు ఆ ప్రాంతాల్లో అక్రమంగా కోహ్లా హైడ్రో ప‌వ‌ర్ ప్రాజెక్టులు నిర్మిస్తున్నాయని, ఆ ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఆపకపోతే వాటిని అడ్డుకుంటామ‌ని తేల్చిచెప్పారు. ఆయా ప్రాజెక్టులు ఆపే వ‌ర‌కు తమ నిర‌స‌న‌లను కొనసాగిస్తూనే ఉంటామని తెలిపారు. కాగా, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని జీలం న‌దిపై హైడ్రో ప‌వ‌ర్ ప్లాంట్‌ను నిర్మిస్తున్నారు. ఈ 1,128 మెగావాట్ల జ‌లవిద్యుత్ ప్లాంట్‌ కోసం 92.9 బిలియ‌న్ డాలర్లు వెచ్చిస్తున్నారు. ఈక్రమంలోనే చైనా, పాకిస్థాన్ ప్ర‌భుత్వాలు చేపట్టిన పలు ప్రాజెక్టులపై మండిపడుతూ పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్(పీవోకే)లోని ముజ‌ఫ‌రాబాద్ వాసులు ఆందోళనలకు దిగారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/