గిరిజనుల అణచివేత ఇంకెన్నాళ్లు!

వాస్తవాలపై సూక్ష్మపరిశోధన అవసరం

Tribes in India -File
Tribes in India -File

ప్రజాస్వామ్యంలో గిరిజనుల సమస్యను చర్చించేటప్పుడు వాస్తవాలను సూక్ష్మంగా పరిశోధించడం చాలా అవసరం.ప్రస్తుతం మనం గిరిజనుల సమస్యల గూర్చి వింటున్నాం.

గిరిజనులను మనుషులుగా గుర్తించడం లేదని మనం అర్థం చేసుకోవచ్చు.

గిరిజన ప్రాంతాలలో పరాయికరణకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు జరిగాయి. కాని గిరిజనులు ఇంకా విముక్తి కాలేదనే భీకర సత్యం మనకి అర్థం అవుతుంది.

గిరిజనుల సహజవనరులని, భూముల్ని అక్రమంగా ఆక్రమించుకోవడానికి చట్టాలు, గిరిజన భూములు, ఉద్యోగాలు గిరిజనులకు మాత్రమే చెందాలనే చట్టాలు, చట్టాల మధ్య వైరుధ్యం ఎంతో గందరగోళాన్ని సృష్టించింది.

గిరి జనులకు అనుకూలంగా ఉన్నచట్టాలు ప్రతిదశలోనూ ఉల్లంఘనలకు గురై చట్టాలు వాటిని మించిన ఉల్లంఘనలు ఎప్పటికీ యధాతథపరిస్థితే.

భూసమస్యలతో గిరిజనుల తిరు గుబాట్లు,వాటిఅణచివేతలు దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉన్నాయి.

గిరిజనుల బతుకుల్ని బాగు చేయడానికి ఏ చట్టాలు, నిబంధనలు, పాన్లు, సబ్‌ప్లాన్లు, కమిషన్లు, అమలుకాని దుర్భర జీవిత చిత్రమే ఆదివాసీల జీవితగాథలు.

గిరిజనుల సమస్యలను అన్ని కోణాల నుండి అర్థం చేసుకోవడానికి ఏకైక మార్గం వాటి మూలాల్లోకి వెళ్లి శోధించడమే. గిరిజనులు కొండ, మైదాన ప్రాంతాలకు పరిమితమై మైనారిటీలుగా ఉంటున్నాయి.

గిరిజన ప్రాంతాలలో అనేక మార్పు లు జరిగాయి.గిరిజనేతరులు పెద్దఎత్తున చొచ్చుకుని వచ్చి గిరిజ నుల భూములను,సహజవనరులను,ఉద్యోగ అవకాశాలను లేకుండా చేశారు.

ఈ పరాయికరణ నిజంగా పాలస్తీనా ప్రజలు యూదుల దౌర్జన్యానికి గురైనట్టు అనిపిస్తుంది.

పాలస్తీన ప్రజలకు ఇజ్రాయిల్‌ దురాక్రమణదారులు మొత్తం భూభాగం లేకుండా చేసి తరిమి వేశారు. ఇక్కడ గిరిజనేతరులు గిరిజనులను కూలీలుగా మార్చడం జరిగింది.

ప్రభుత్వాలు వేర్వేరు రూపాలలో దోపిడీ చేయడం జరిగింది.

18వ శతాబ్దంలో స్వేచ్ఛగా, స్వతంత్రంగా విరిసిల్లిన గిరి జనులు ప్రపంచీకరణ, పెట్టుబడిదారి వ్యవస్థ నాగరికత సమా జంలో తమ అస్తిత్వం, మనుగడ కోల్పోతూ, జీవన విధానం నాశనమై అంతరించిపోతున్నారు.

వలసపాలన నుండి దోపిడీకి వ్యతిరేకంగా నేడు స్వాతంత్య్రనంతరం ప్రజాస్వామ్య వ్యవస్థలో జీవించే హక్కుకోసం పోరాడుతూనే ఉన్నారు.

దేశంలో ఎక్కడ చూసినా గిరిజనుల అరణ్యరోదన కన్పిస్తుంది. వాళ్ల జీవితాలు అడవ్ఞలు, కొండలు, ప్రకృతి సంపదలో సాంప్రదాయం, సంస్కృతి ధ్వంసం చేయబడింది.

వారి ఐదువ షెడ్యూలులో స్వయం పాలన, స్వయం నిర్ణయ హక్కును హరించడమే కాక ప్రపంచీకరణ ముసు గులో జరిగే దోపిడీకి దుర్భరమైన జీవితాన్ని గడపవలసిన పరిస్థితి వస్తుంది.

ఐక్యరాజ్య సమితి ప్రకారం ప్రపంచంలో 100 దేశాలలో ఐదువేల తెగలకు చెందిన 50 కోట్ల ఆదివాసీలు 6700 భాషలను మాట్లాడుతున్నారు.

భారతదేశంలో 461 గిరిజన తెగలుండగా 92 శాతం మంది గిరిజనులు నేటికీ అడవిపైనే ఆధారపడి జీవిస్తున్నా రు. కానీ నేడు దేశంలో గిరిజనులకు వ్యతిరేకంగా దోపిడీ జరుగు తుంది.

ప్రపంచంలో గిరిజనులు స్వేచ్ఛ, సమానత్వంతో బతికిన చరిత్ర ఎక్కడా కన్పిం చదు.ప్రపంచంలో భూమిపుత్రులు, ఆది వాసులు, గిరిజనులు తమనుతాము కాపా డుకోవడానికి పోరాడు తూనే ఉన్నారు.

అమెరికాలో రెడ్‌ ఇండియన్స్‌, ఆస్ట్రేలియాలో ఇండిజీని యస్‌, కెనడాలో క్యూభిక్‌ భూమి పుత్రులను ఊచకోత కోసి వారి సహజ వనరులను దోచుకుంటుంది.

ప్రపంచంలో ఎక్కడచూసినా గిరిజనులు పెట్టుబడిదారీ వ్యతిరేకంగా పోరాడు తూనే ఉన్నారు.

పురాతన కాలం నుండి ప్రపంచీకరణ వరకు గిరిజనులను ఊచకోత కోసి వారినిలేకుండా చేసి,వాళ్ల సహజ వనరులను దోచుకొని,ప్రపంచ చరిత్ర అంతా గిరిజనులను అణచివేసిన చరిత్రగా కన్పిస్తుంది.

ఎక్కడ చూసినా అభివృద్ధి అనే పేరుతో గిరిజనులు బలైపోవడం జరుగుతుంది.

భారతదేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, ఒడిశా, ఈశాన్య రాష్ట్రాలలో రాజ్యాంగ విలువలకు వ్యతిరేకంగా అధికారపార్టీలు, ప్రతిపక్షపార్టీలు గిరిజనులను మోసం చేస్తు న్నాయి.

ఇవన్నీకూడా గిరిజన గూడెలు,స్వయం ప్రతి పత్తి,సామాజిక న్యాయం, సమాన హక్కుల కోసం ప్రవేశపెట్టడం జరిగింది.

భారతదేశంలో స్వాతంత్య్రం వచ్చిన కొన్నిసంవత్సరాలలో అనేక ప్రభుత్వాలు వచ్చాయి.

అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను పెట్టడంతో వారి జీవన స్థితిగతులు మారలేదు.

కానీ పాలకులు బాగుపడ్డారు. రాజ్యం, ప్రభుత్వాంగాలు పెట్టుబడిదారీ వర్గానికే అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి.అనేక ప్రభుత్వాలు అనేక వాగ్దా నాలు చేశాయి.

కాని వాళ్ల జీవితాల్లో చీకటి కమ్ముక్కుపోయింది. రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు,ఆదేశికసూత్రాలు, ఐదు షెడ్యూ లు, ఆరు షెడ్యూలు అనేవి అర్థరహితంగా మిగిలిపోతున్నాయి.

వీటిని పటిష్టంగా అమలుచేసి ఉంటే వాళ్ల సామాజిక, ఆర్థికపరిస్థితి లో ఎన్నోమార్పులు జరిగిఉండేవి. గిరిజన ప్రాంతాల్లో స్థితిగతుల్ని సమీక్షించే అధికారం గవర్నర్‌కు, రాష్ట్రపతికి ఉన్నాయి.

కాని వాళ్లు ఎప్పుడుపట్టించుకోలేదు.ఈ విధంగా ఆదివాసుల మనుగడ లేకుం డాపోయే అవకాశం ఉంది.ఐక్యరాజ్యసమితి సూత్రాలను పాటించ వలసిన బాధ్యత ప్రతిప్రభుత్వంపై ఉంది.

అప్పుడే గిరిజనులకు నీరు, భూమి వనరులపై స్వేచ్ఛ,స్వతంత్య్రాలను కలిగి ఉంటారు. కాని ప్రభుత్వం సవతితల్లి ప్రేమను చూపిస్తున్నాయి.అనేక చట్టాల ను గిరిజనేతరులు చట్టానికి చుట్టాలుగా మార్చుకున్నారు.

సామా జిక,ఆర్థిక వ్యతిరేకంగా గత వందలసంవత్సరాలుగా పోరాడుతూనే ఉన్నారు.

గిరిజనుల ఉద్యమాలన్నీ రాజ్యవ్యతిరేక ఉద్యమంగానో, రైతుల ఉద్యమంగానో, శాంతిభద్రతల సమస్యగానో చిత్రీకరించి నిర్దాక్షణ్యంగా అణచివేస్తుంది.

స్వయం పాలన ఏర్పడినప్పుడే ప్రజాస్వామ్య విలువలు రక్షించబడతాయి.

-ఆర్‌.రాందాస్‌

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/