ప్రచారంలో వైసీపీ ఎమ్మెల్యే ..మహిళతో అభ్యంతరకర వ్యాఖ్యలు

ఎన్నికల ప్రచారంలో బొబ్బిలి వైసీపీ ఎమ్మెల్యే శంబంగి చిన్న అప్పలనాయుడు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇటీవల దొంగురువలస గ్రామంలో మ్మెల్యే పర్యటించగా.. ఓ గిరిజన మహిళ తమ సమస్యలపై ప్రశ్నించింది. కొండోళ్లం కొండోళ్లలానే ఉండిపోయామంది. దీనికి అప్పలనాయుడు స్పందిస్తూ..’ ఎక్కడ ఉన్నోళ్లు అక్కడ కాక పొరుగూర్లో ఉంటారా? ఇది వరకు జాకెట్ ఉందా? ఓ చీర కట్టారా’ అని అన్నారు. దీనిపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

చిన్న అప్పలనాయుడు పురుష అహంకారి అని టీడీపీ నేత గుమ్మడి సంధ్యారాణి ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే గిరిజన మహిళపై చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు. సీఎం జగన్​ హయాంలో ఏం అభివృద్ధి జరిగిందని ఆమె ప్రశ్నించడమే తప్పయిందా? అని అన్నారు. అప్పల నాయుడుకు వయస్సు పెరిగిందని కానీ బుద్ధి మాత్రం పెరగలేదని దుయ్యబట్టారు. వైసీపీ నేతలకు స్త్రీలను అవమానించడం కొత్తేమీ కాదని విమర్శించారు.