కోవిడ్ విస్తరణను అడ్డుకోగలిగాం : ఏపీ సీఎం జగన్
ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి వెల్లడి

Amaravati: కరోనా నివారణకు వ్యాక్సినేషన్ సరైన పరిష్కారమని, ప్రైౖవేటు ఆస్పత్రుల్లో వినియోగించకుండా ఉండిపోయిన స్టాకు కోటాను తిరిగి రాష్ట్రానికి కేటాయించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి కోరారు. కోవిడ్ నివారణలో రాష్ట్రానికి అందిస్తున్న సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్ నివారణా చర్యలపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి జగన్ పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర విభజన వల్ల వైద్యపరంగా మౌలిక సదుపాయాల సమస్యను ఎదుర్కొన్నామన్నారు.
రాష్ట్ర విభజన వల్ల హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై లాంటి నగరాలు ఏపీలో లేవని ప్రధానికి వివరించారు. అయినా సరే కోవిడ్‌ను ఎదుర్కోవడంలో చెప్పుకోదగ్గ పనితీరు కనబరిచామని చెప్పారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసుకున్న గ్రామ, వార్డు సచివాలయాలు కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో సమర్థవంతంగా పనిచేశాయని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటివరకు 12 సార్లు ఇంటింటికీ ఫీవర్ సర్వే చేశామని, లక్షణాలున్నవారిని గుర్తించి, ఫోకస్‌గా టెస్టులు చేసి, వైద్య సేవలు అందించామన్నారు.
దీనివల్ల కోవిడ్ విస్తరణను అడ్డుకోగలిగామన్నారు. రాష్ట్రానికి 1,68,46,210 వ్యాక్సిన్ డోసులు వచ్చాయని, వీటితో 1,76,70,642 మందికి వ్యాక్సిన్లు ఇచ్చామని వివరించారు. వ్యాక్సినేషన్లో మంచి విధానాల వల్ల ఇచ్చినదానికన్నా ఎక్కువ మందికి వేయగలిగామన్నారు. జూలై నెలలో 53,14,740 వ్యాక్సిన్లు మాత్రమే రాష్ట్రానికి కేటాయించారని, ప్రైౖ వేటు ఆస్పత్రులకు 17,71,580 వ్యాక్సిన్లను కేటాయించారని చెప్పారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/