గంటా చేరికపై విజయసాయిరెడ్డి స్పందన

వైఎస్‌ఆర్‌సిపిలోకి రావాలనుకుంటే పదవికి రాజీనామా చేయాలి

vijaya sai reddy
vijaya sai reddy

అమరావతి: టిడిపి సీనియర్‌ నేత గంటా శ్రీనివాసరావు వైఎస్‌ఆర్‌సిపిలో చేరేందుకు సిద్ధమయ్యాడని వస్తున్న వార్తలపై వైఎస్‌ఆర్‌సిపి ఎంపి విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్‌ఆర్‌సిపిలో చేరాలనుకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలంటూ విజయసాయి అన్నారు. వ్యక్తుల కోసం తమ పార్టీ సిద్ధాంతాలను మార్చలేమని అన్నారు. వైఎస్‌ఆర్‌సిపిలోకి ఎవరైనా రావాలనుకుంటే ముందుగా రాజీనామా చేయాలనేది పార్టీ సిద్ధాంతమని విజయసాయి చెప్పారు. జగన్ సుపరిపాలనను చూసి వైఎస్‌ఆర్‌సిపిలో చేరేందుకు పలువురు ఎమ్మెల్యేలు సుముఖంగా ఉన్నారని అన్నారు. అయితే పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. విజయసాయి వ్యాఖ్యలు ఇప్పుడు వైఎస్‌ఆర్‌సిపిలో చర్చనీయాంశంగా మారాయి. గంటా చేరికను విజయసాయి తొలి నుంచీ వ్యతిరేకిస్తున్నారంటూ వార్తలొస్తున్న సంగతి తెలిసిందే.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/