పార్టీ ఎంపిలతో సిఎం సమావేశం

jagan mohan reddy
jagan mohan reddy

అమరావతి: ఏపి సిఎం జగన్‌ ఈరోజు వైఎస్‌ఆర్‌సిపి ఎంపిలతో సమావేశం కానున్నారు. ఈ ఉదయం 12.30 గంటలకి వారితో వర్చువల్ మీటింగ్‌లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపిలతో చర్చించనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్ట్‌ల సాధనపై దిశానిర్దేశం చేయనున్నారు. ఏపికి ప్రత్యేక హోదా అంశాన్ని పార్లమెంట్‌లో చర్చకు తీసుకురావాలని సూచించనున్నారు. అన్ని ఫార్మాట్ల అవకాశాలను పార్లమెంట్‌లో వినియోగించుకునేలా సిఎం, ఎంపిలకు దిశా నిర్దేశం చేయనున్నారు రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిలు, కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులతో పాటు పోలవరం ప్రాజెక్ట్‌కు నిధుల సాధన అజెండాగా నేటి సమావేశం జరగనుంది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: