టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో టీం ఇండియా , పాకిస్తాన్ ఒకే గ్రూప్‌లో

గ్రూప్‌లను ప్రకటించిన ఐసీసీ

Team India and Pakistan in the same group in the T20 World Cup
Team India and Pakistan in the same group in the T20 World Cup

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో టీం ఇండియా , పాకిస్తాన్ ఒకే గ్రూప్‌లో ఉన్నాయి . శుక్ర‌వారం ఐసీసీ గ్రూపుల‌ను ప్ర‌క‌టించింది. అక్టోబ‌ర్ 17 నుంచి న‌వంబ‌ర్ 14 మ‌ధ్య యూఏఈలో టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ జ‌ర‌గ‌నున్న విషయం తెలిసిందే. సూప‌ర్ 12లో ఇండియా గ్రూప్ 2లో ఉన్నాయి..వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో రెండు రౌండ్లుగా మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. తొలి రౌండ్‌లో గ్రూప్ ఎ, గ్రూప్ బిలోని 8 టీమ్స్ పాల్గొంటాయి. ఇందులో నుంచి నాలుగు టీమ్స్ ప్ర‌ధాన రౌండ్‌కు అర్హత సాధిస్తాయ‌ని ఐసీసీ వెల్ల‌డించింది. నిజానికి ఇండియాలో జ‌ర‌గాల్సిన ఈ టోర్న‌మెంట్ క‌రోనా కార‌ణంగా యూఈఏకి త‌ర‌లించారు. అయితే టోర్నీ హోస్ట్‌గా ఇండియానే ఉంటుంది.

గ్రూప్ 1: వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, గ్రూప్ ఎ విజేత‌, గ్రూప్ బి ర‌న్న‌ర‌ప్‌
గ్రూప్ 2: ఇండియా, పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌, ఆఫ్ఘ‌నిస్థాన్‌, గ్రూప్ ఎ ర‌న్న‌ర‌ప్‌, గ్రూప్ బి విజేత‌
గ్రూప్ ఎ: శ్రీలంక‌, ఐర్లాండ్‌, నెద‌ర్లాండ్స్‌, నమీబియా
గ్రూప్ బి: బంగ్లాదేశ్‌, స్కాట్లాండ్‌, ప‌పువా న్యూగినియా, ఒమ‌న్

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/