రేపు ఢిల్లీకి ఏపీ సీఐడీ టీమ్..టీడీపీ శ్రేణుల్లో టెన్షన్

చంద్రబాబు అరెస్ట్ తర్వాత రాజకీయాల్లో మరింత వేడెక్కాయి. స్కిల్ డెవలప్ కేసులో బాబు ను అరెస్ట్ చేసి 10 రోజులు కావొస్తున్నా ఇంకా బెయిల్ రాలేదు..లాయర్లు ఎన్ని వాదనలు , పిటిషన్లు వేస్తున్నప్పటికీ బెయిల్ ఫై విచారణ వాయిదా పడుతూ వస్తుంది. ఇదే క్రమంలో నారా లోకేష్ ను కూడా CID అధికారులు అరెస్ట్ చేస్తారనే వార్తలు మరింత జోరు అందుకోవడం తో టీడీపీ శ్రేణుల్లో మరింత భయం పుడుతుంది.

తాజాగా ఏపీ సీఐడీ టీమ్ రేపు ఢిల్లీ వెళుతుండడం..ప్రస్తుతం లోకేష్ సైతం ఢిల్లీ లోనే ఉండడం తో మరింత భయపడుతున్నారు.సీఐడీ చీఫ్ సంజయ్ తోపాటు మరో ఎస్పీ సరిత, ఇద్దరు సీఐలు, నలుగురు కానిస్టేబుల్స్ రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. దీంతో నారా లోకేష్ ను ఏమైనా అరెస్టు చేస్తారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలోనే CID టీం సుప్రీం కోర్టు లీగల్ టీంతో చర్చిస్తారని అంటున్నారు. అయితే ఢిల్లీలో లోకేష్ ఏం చేస్తున్నాడు..ఎవరెవర్నీ కలుస్తున్నారన్న దానిపై సీఐడీ ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఢిల్లీ కేంద్రంగా చంద్రబాబు అవినీతిని చెప్పే ప్రయత్నాల్లో సీఐడీ ఉన్నట్లు తెలుస్తోంది. మరి రేపు cid ఢిల్లీ వెళ్ళాక కానీ అసలు సంగతి తెలియదు.