మంత్రి మల్లారెడ్డి కాన్వాయ్‌పై దాడి..

తెలంగాణ కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి కి చేదు అనుభవం ఎదురైంది. ఘట్‌కేసర్‌ లో ఆదివారం రెడ్డి సింహగర్జన కార్యక్రమం జరిగింది. రెడ్డి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మంత్రి మల్లారెడ్డి హాజరయ్యారు. ఆయన వచ్చినప్పుడు బాగానే ఉన్న వాతావరణం సభా వేదికపైకి ఎక్కి మాట్లాడుతుండగా..అక్కడికి వచ్చిన వారిలో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది.

మంత్రి తమ సామాజికవర్గానికి సంబంధించిన మాటలు మాట్లాడతారని అనుకుంటే..తెరాస ప్రభుత్వం గురించి, కేసీఆర్ పాలన గురించి పదే పదే మాట్లాడుతుండడం తో అక్కడికి వచ్చినవారు అడ్డుకున్నారు. మల్లారెడ్డి గో బ్యాగ్‌ అంటూ స్థానికులు నినాదాలు చేశారు. మల్లారెడ్డి కాన్వాయ్‌పై కుర్చీలు, బాటిళ్లు విసిరారు. కొందరు అయితే రాళ్లు, చెప్పులు సభా వేదిక వైపు విసిరే ప్రయత్నం చేశారు. జరగబోయే చేదుఅనుభవాన్ని ముందుగానే పసిగట్టినట్లుగా మంత్రి వెంటనే తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి వేదిక దిగి వెళ్లిపోయారు. మల్లారెడ్డి వెళ్తున్న సమయంలో కూడా కాన్వాయ్‌పై బాటిళ్లు, కుర్చీలు విసిరేశారు. ప్రస్తుతం దీనికి సంబదించిన వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.