విశాఖే రాజధాని అంటూ ఢిల్లీలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

ఏపీ రాజధాని పై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన ఇన్వెస్టర్ల సదస్సు లో ఏపీ రాజధాని విశాఖనే అని , త్వరలో విశాఖ రాజధాని కాబోతోందని.. తాను కూడా అక్కడికి షిఫ్ట్ అవుతాను అన్నారు. త్వరలోనే విశాఖ నుంచి పాలనా వ్యవహారాలు ఉంటాయన్నారు. ఏపీ మూడు రాజధానులపై సుప్రీం కోర్టు లో విచారణలో ఉన్న సమయంలోనే జగన్ ఇలా కామెంట్స్ చేయడం తో అంత విమర్శిస్తున్నారు.

ఢిల్లీలో జరుగుతున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సదస్సు సన్నాహక సమావేశంలో ఏపీ సీఎం జగన్ పాల్గొన్నారు. మార్చి నెలలో విశాఖ వేదికగా గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సు జరగనుంది. ఢిల్లీలో ఇందుకు సంబంధించిన సన్నాహక సదస్సు జరిగింది. ఈ సమావేశంలో జగన్ పాల్గొని ఇన్వెస్టర్లను ఉద్దేశించి మాట్లాడారు. త్వరలో విశాఖ రాజధాని కాబోతోందని.. తాను కూడా అక్కడికి షిఫ్ట్ అవుతాను అన్నారు. త్వరలోనే విశాఖ నుంచి పాలనా వ్యవహారాలు ఉంటాయన్నారు.. సీఎం క్యాంపు కార్యాలయంపై సంకేతాలు ఇచ్చారు. మార్చి 3,4 న విశాఖలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నామన్నారు. విశాఖ లో జరిగే అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సుకు మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నాను అన్నారు. పరిశ్రమల అనుమతుల విషయంలో సింగిల్ డెస్క్ విధానం అమలు చేస్తున్నామన్నారు. 21 రోజుల్లో పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నట్లు తెలిపారు.

జగన్‌ వ్యాఖ్యలను న్యాయనిపుణులు తప్పుపడుతున్నారు. కోర్టు విచారణలో ఉండగానే విశాఖను రాజధానిగా ఎలా భావిస్తారని ప్రశ్నిస్తున్నారు. జగన్ వ్యాఖ్యలు కోర్టు ధిక్కారణ కిందకు వస్తాయని న్యాయనిపుణులు తెలిపారు. నేడు సుప్రీం కోర్టులో అమరావతిపై విచారణ జరుగనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.