‘ప్రతీ సేవా కార్యక్రమాన్ని మీరా పేరుతో ప్రారంభిస్తాను’ – విజయ్ ఆంటోనీ

బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోనీ ఇంట తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. విజయ్ కూతురు మీరా రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకొని చనిపోయిన సంగతి తెలిసిందే. మీరా మరణం..యావత్ చిత్రసీమలో విషాద ఛాయలు అల్లుకునేలా చేసింది.

మీరా ఆంటోని మృతి తో విజయ్ ఆంటోని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మీరా మృతి తర్వాత సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు. మీరాతోపాటు తాను కూడా చనిపోయానని రాసుకొచ్చారు. ప్రపంచం కంటే మెరుగైన ప్రదేశానికి పెద్ద కూతురు వెళ్లింది. మీరా ఎంతో ప్రేమగా ఉండేది. ధైర్యంగా ఉంటుంది. కులం, మతం, డబ్బు, అసూయ, బాధ, పేదరికం, ద్వేషం లేని ప్రశాంతమైన ప్రదేశంలోకి వెళ్లింది. తాను వెళ్లినప్పటికీ.. ఇప్పటికీ తనతో మాట్లాడుతోంది.

మీరాతోపాటు తను చనిపోయాను. ఆమెతో సమయం గడపడం ప్రారంభించాను. ఇకపై తాను చేసే ప్రతీ సేవా కార్యక్రమాన్ని మీరా పేరుతో ప్రారంభిస్తాను’ అని విజయ్ ఆంటోనీ ట్వీట్ చేశారు. విజయ్ షేర్ చేసిన పోస్ట్ ప్రతీ ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది. కూతురుపై ఆయనకు ఉండే ప్రేమను చాటుతోంది. 12వ తరగతి చదువుతోన్న మీరా.. ఒత్తిడికి గురై తన గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.