ప్రారంభమైన ఏపీ కేబినెట్ సమావేశం

అమరావతి : ఏపీ కేబినెట్ సమావేశం సోమవారం ఉదయం ప్రారంభమైంది. మూడు రాజధానులపై కేబినెట్‌లో కీలక నిర్ణయం అంటూ ప్రచారం జరుగుతోంది. 3 క్యాపిటల్స్‌పై చేసిన చట్టంపై కాబినెట్‌లో చర్చ జరుగనుంది. మూడు రాజధానుల చట్టంలో మార్పులు చేస్తారా…. రద్దు చేస్తారా అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు రాష్ట్రంలో వరదల కారణంగా నేటితోనే శాసనసభ సమావేశాలను ముగించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. కేబినెట్ నిర్ణయం తర్వాత సమావేశాలను వాయిదా వేసే అవకాశం ఉంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/