కెన‌డాలో కొవాగ్జిన్‌కు గుర్తింపు!

ఒట్టావా : క‌రోనా నియంత్ర‌ణ‌కు భార‌త్ బ‌యోటెక్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను ఈ నెల 30 నుంచి కెన‌డా గుర్తించ‌నున్న‌ది. దీని ప్ర‌కారం ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్‌వో) ఆమోదం పొందిన వ్యాక్సిన్లు వేసుకున్న ప్ర‌యాణికుల‌ను ఈ నెలాఖ‌రు నుంచి త‌మ దేశంలోకి అనుమ‌తించ‌నున్న‌ట్లు తెలిపింది. కొవాగ్జిన్‌తోపాటు సినోఫార్మ్ (కొవిలో), సిఓవాక్ (క‌రోనావాక్‌) వ్యాక్సిన్ల‌నూ కెన‌డా గుర్తించ‌నున్న‌ది.

ఇప్ప‌టికే గుర్తించిన ఏ వ్యాక్సిన్ అయినా రెండు డోస్‌లు వేసుకున్న వారిని, మిశ్ర‌మ డోస్‌లు వేసుకున్న వారిని అనుమ‌తిస్తామ‌ని కెన‌డా తెలిపింది. జాన్స‌న్ అండ్ జాన్స‌న్ వారి సింగిల్ డోస్ జ‌న్‌స్సెన్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి అనుమ‌తి ఉంటుంద‌ని పేర్కొంది. అయితే ప్ర‌యాణికులు కెన‌డాకు వెళ్ల‌డానికి 14 రోజుల ముందు వ్యాక్సినేష‌న్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంద‌ని తెలిపింది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/