క్రిస్‌మస్‌ పరేడ్‌పైకి దూసుకెళ్లిన కారు

వాషింగ్టన్‌: అమెరికాలో విస్కాన్సిన్‌లో క్రిస్మస్ పరేడ్‌లో పాల్గొన్న జనాలపైకి ఓ ఎస్‌యూవీ దూసుకెళ్లింది. దీంతో 20 మందికిపైగా గాయపడ్డారు. వీరిలో చిన్నారులు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. విస్కాన్సిన్‌లోని వౌకేశా ప్రాంతంలో ఆదివారం సాయంత్రం క్రిస్మస్‌ పరేడ్‌ జరిగింది. ఈ పరేడ్‌పైకి ఎస్‌యూవీతో ఓ డ్రైవర్‌ దూసుకెళ్లాడు. సుమారు 20 మందికిపైగా ఢికొట్టాడు. దీంతో అక్కడ భీతావహ వాతావరణ నెలకొన్నది. క్షతగాత్రులను దవాఖానలకు తరలించారు. పలువురు ప్రాణాలు కోల్పోయారని వౌకేశా పోలీస్ చీఫ్ డేన్ థాంప్సన్ తెలిపారు. ఎంత మంది మరణించారనే సంఖ్య ఇంకా తెలియరాలేదన్నారు. ఈ ఘటనలో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/