రాజధాని తరలింపు చేపట్టబోము
బిల్లు పాస్ అయ్యేవరకు ఆ ప్రక్రియ చేపట్టబోము: ఏజి

అమరావతి: రాజధాని తరలింపుపై హైకోర్టులో అమరావతి పరిరక్షణ సమితి తరపున కార్యదర్శి గద్దే తిరుపతి రావు పిటీషన్ దాఖలు చేయగా.. దానిని హైకోర్టు నేడు విచారించింది. ఇందులో పిటిషనర్ రాజధానిని విశాఖకు తరలించే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నాడు. అయితే రాజధాని వికేంద్రికరణకు ఉద్దేశించిన బిల్లు పాస్ అవ్వకుండా రాజధాని తరలింపు ప్రక్రియ చేపట్టబోమని ఏజి హైకోర్టుకు తెలిపారు. కాగా దీనిపై ప్రమాణ పత్రం దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించగా.. అందుకు పది రోజుల సమయం కావాలని ఏజి కోరారు. దీనికి హైకోర్టు వారికి పదిరోజుల సమయమిచ్చింది. కేంద్రం కూడా దీనిపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/