భారత్‌లో మరో కరోనా వైరస్ కేసు నిర్ధారణ
దేశంలో 31కి చేరిన కరోనా వైరస్ బాధితులు

న్యూఢిల్లీ: కరోనా వైరస్ (కొవిడ్-19) భారత్‌లో కలకలం రేపుతుంది. ఈనేపథ్యంలో ఢిల్లీలోని మరో వ్యక్తికి కరోనా సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి సంజీవ కుమార్ తెలిపారు. ఢిల్లీ ఉత్తమ్ నగర్‌కు చెందిన వ్యక్తికి కరోనా వైరస్ సోకింది. ఉత్తమ్ నగర్‌లో కరోనా బాధితుడిగా మారిన వ్యక్తి ఇటీవల థాయిలాండ్, మలేషియాల్లో పర్యటించారని అధికారులు తెలిపారు. దీంతో భారత్‌లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 31కి చేరుకుంది. కాగా, కరోనా గురించి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ నిన్న అధికారికంగా ప్రకటన చేసి దేశంలో మొత్తం కొవిడ్19 కేసులు 29కి చేరినట్టు వివరించిన విషయం తెలిసిందే.
తాజా వీడియోస్ కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/videos/