హైదరాబాద్ కు వచ్చిన జస్టిస్ ఎన్వీ రమణకు ఘన స్వాగతం

‘రసమయి – డాక్టర్ అక్కినేని లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డ్’ను స్వీకరించనున్న మాజీ సీజేఐ

justice-nv-ramana-reached-hyderabad

హైదరాబాద్ః భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ ఇటీవలే పదవీ విరమణ చేసిన విషయం తెలిసిందే. అయితే రిటైర్ అయిన తర్వాత ఆయన తొలిసారి హైదరాబాద్ కు వచ్చారు. ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న జస్టిస్ ఎన్వీ రమణ దంపతులకు ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం లభించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కన్నెగంటి లలిత, జస్టిస్ నాగార్జున, జస్టిస్ బి.శరత్, జస్టిస్ సాంబశివరావు, జస్టిస్ చిన్నకూరి సుమలత, జస్టిస్ సీవీ భాస్కర్ రెడ్డి, జస్టిస్ వేణుగోపాల్, జస్టిస్ ఎన్ సుధీర్ కుమార్, జస్టిస్ పుల్ల కార్తీక్, జస్టిస్ లక్ష్మణ్ లతో పాటు టిఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, పలువురు ప్రజాప్రతినిధులు, బంధుమిత్రులు స్వాగతం పలికారు. అక్కినేని నాగేశ్వరరావు 99వ జయంతి కార్యక్రమానికి జస్టిస్ ఎన్వీ రమణ హాజరవుతారు. ఈరోజు సాయంత్రం తెలుగు విశ్వవిద్యాలయంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా ‘రసమయి – డాక్టర్ అక్కినేని లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డ్’ను ఆయన స్వీకరించనున్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/