చిరంజీవి మూవీ కి ‘సాహూ’ దర్శకుడు!

కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ చిత్రం తర్వాత ఆయన మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ రీమేక్ లో నటిస్తారని సమాచారం.
ఇప్పటికే ఈ చిత్ర తెలుగు రీమేక్ రైట్స్ రామ్ చరణ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఐతే మరి ఈ రీమేక్ తెరకెక్కించే బాధ్యత చిరు ఏ దర్శకుడికి ఇస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది.
ఇప్పటికే వివి వినాయక్ తో పాటు మరికొందరు దర్శకుల పేర్లు వినిపిస్తుండగా ఈ లిస్ట్ లోకి మరో దర్శకుడి పేరు వచ్చి చేరింది. ప్రభాస్ హీరోగా విడుదలైన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సాహో కి దర్శకత్వం వహించిన సుజీత్ లూసిఫర్ తెలుగు రీమేక్ కి దర్శకత్వం వహించే అవకాశం కలదు.
చిరంజీవి మరియు నిర్మాత రామ్ చరణ్ అతని పేరును కూడా పరిశీలిస్తున్నారంటూ సమాచారం. మరి ఇదే నిజమైతే సుజీత్ మరో మారు సువర్ణావకాశం దక్కించుకున్నట్లే.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/