మరోసారి అమెరికాలోని ఓ పాఠశాలలో కాల్పులు

వాషింగ్టన్ : మరోసారి అమెరికాలోని ఓ పాఠశాలలో కాల్పులు కలకలం సృష్టించాయి. న్యూ ఓర్లీన్స్‌ హైస్కూల్‌ స్నాతకోత్సవంలో కాల్పులు ఘటన చోటు చేసుకున్నది. ఈ ఘటనలో ఓ మహిళ మరణించగా.. ఇద్దరు గాయపడ్డారు. జేవియర్ యూనివర్శిటీ క్యాంపస్‌లోని కాన్వొకేషన్ సెంటర్ వెలుపల కాల్పులు జరిగాయి. కాల్పుల ఘటనను లూసియానా పోలీసులు ధ్రువీకరించారు. అయితే, కాల్పులకు కారణాలు మాత్రం తెలియరాలేదు. కాల్పులకు పాల్పడిన అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు.

కాగా, గతవారం టెక్సాస్‌లోని ఉవాల్డేలోని రాబ్ ఎలిమెంటరీ స్కూల్‌లో జరిగిన కాల్పుల ఘటనలో 19 మంది చిన్నారులు సహా పలువురు మరణించిన విషయం తెలిసిందే. వరుసగా జరుగుతున్న కాల్పుల ఘటనతో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/