తెలంగాణలో మరో 1,296 కేసులు నమోదు

జీహెచ్ఎంసీ పరిధిలో 557 మందికి కరోనా

corona virus-telangana

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతుంది. కొత్తగా 1,296 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దాంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 45,076కి పెరిగింది. అత్యధికంగా జీహెచ్ఎంసీలో నిన్న 557 కేసులను గుర్తించారు. తాజాగా 1,831 మందిని డిశ్చార్జి చేశారు. ప్రస్తుతం 12,224 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న మరో ఆరుగురు కరోనాతో మృత్యువాత పడడంతో మొత్తం మరణాల సంఖ్య 415కి పెరిగింది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/