ప్రపంచంలో కరోనా మహమ్మారి ఉధృతి

వైరస్‌ బాధితులు 1,96,04,494

Calm the corona epidemic in the world-
Calm the corona epidemic in the world-

ప్రపంచంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా అన్నింటా తన ప్రభావాన్ని చూపుతోంది. రోజుకు 3లక్షల మంది వరకు కరోనా వైరస్‌ బారిన పడుతున్నారు.

ఇప్పుడు కరోనా బాధితుల సంఖ్య 2 కోట్లకు చేరువలో ఉంది.

ఇప్పటి వరకు ప్రపంచంలో కోటీ 96లక్షల 4వేల 494 మందికి కరోనా సోకింది. అందులో కోటీ 25లక్షల 87వేల 302 మంది కోలుకోగా, 7లక్ష 25వేల 42 మంది మృత్యువాత పడ్డారు. అగ్ర స్థానంలో ఉన్న అమెరికాలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది.

ఆ దేశంలో రోజుకు 60వేల నుంచి 80వేల వరకు కొత్త కేసులు నమోదవుతున్నాయి. అక్కడ ఇప్పటి వరకు 50లక్షల 99వేల 768 మందికి కరోనా సోకగా, అందులో 26లక్షల 18వేల 31 మంది కోలుకున్నారు. లక్షా 64వేల 171 మంది మరణించారు.

కరోనా కేసుల సంఖ్యలో రెండో స్థానంలో కొనసాగుతున్న బ్రెజిల్‌లో వైరస్‌ వేగంగా విజృంభిస్తోంది. ఇప్పటి వరకు బ్రెజిల్‌లో 29లక్షల 67వేల 64 మందికి కరోనా సోకగా, అందులో 20లక్షల 68వేల 394 మంది కోలుకున్నారు. 99వేల 702 మంది మృత్యువాత పడ్డారు.

Calm the corona epidemic in the world-

కరోనా కేసుల సంఖ్యలో భారత్‌ దేశం మూడో స్థానంలో ఉంది. నాల్గొవ స్థానంలో ఉన్ను రష్యాలో 8లక్షల 82వేల 347 మందికి కరోనా సోకగా, 6లక్షల 90వేల 207 కోలుకున్నారు. 14వేల 854 మంది మరణించారు.

దక్షిణాఫ్రికాలో 5లక్షల 45వేల 476 మందికి వైరస్‌ సోకగా, అందులో 3లక్షల 94వేల759 మంది కోలుకున్నారు. 9,909 మంది మృతిచెందారు.

మెక్సికోలో 4లక్షల 69వేల 407 మందికి వైరస్‌ సోకగా, అందులో 3లక్షల 13వేల 386 మంది కోలుకున్నారు.

51వేల 311 మంది మృత్యువాత పడ్డారు. పెరులో 4లక్షల 63వేల 875 మందికి కరోనా సోకగా, అందులో 3లక్షల 14వేల 332 మంది కోలుకున్నారు.20వేల 649 మంది మృత్యువాతపడ్డారు.

చిలీలో 3లక్షల 68వేల 825 మందికి కరోనా సోకగా, 3లక్షల 42వేల 168 మంది కోలుకున్నారు. 9,958 మంది మృత్యువాత పడ్డారు.

కొలంబియాలో 3లక్షల 67వేల 196 మందికి కరోనా సోకగా, లక్షా 98వేల 495 మంది కోలుకున్నారు. 12,250 మంది మరణించారు.

స్పెయిన్‌లో 3లక్షల 61వేల 442 మందికి కరోన సోకగా, అందులో 28,503 మంది మరణించారు.

ఇరాన్‌లో 3లక్షల 24వేల 692 మందికి కరోనా సోకగా, అందులో 2లక్షల 82వేల 122 మంది కోలుకున్నారు. 18,264 మంది మరణించారు.

యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో 3లక్షల 9వేల 5 మందికి కరోనా సోకగా, అందులో 46,511 మంది మరణించారు.

సౌదీ అరేబియాలో 2లక్షల 87వేల 262 మందికి కరోనా సోకగా, 2లక్షల 50వేల 440 మంది కోలుకున్నారు. 3,130 మంది మృత్యువాత పడ్డారు.

పాకిస్తాన్‌లో 2లక్షల 83వేల 487 మందికి కరోనా సోకగా, అందులో 2లక్షల 59వేల 604 మంది కోలుకున్నారు. 6,068 మంది మరణించారు.

బంగ్లాదేశ్‌లో 2లక్షల 55వేల 113మందికి కరోనా సోకగా, లక్షా 46వేల 604 మంది కోలుకున్నారు. 3,365 మంది మృత్యువాత పడ్డారు.

ఇటలీలో 2లక్షల 49వేల 756 మందికి కరోనా సోకగా, అందులో 2లక్షల ఒక వెయ్యి 642 మంది కోలుకున్నారు. 35,190 మంది మరణించారు.

తాజా ఎన్నారై వార్తల కోసం :https://www.vaartha.com/news/nri/