ప్రత్యక్ష ప్రసారం ప్రారంభమయ్యాకే చర్చ!

శాసన మండలిలో పట్టుబట్టిన టిడిపి సభ్యులు

shariff mohammed ahmed
shariff mohammed ahmed

అమరావతి: ఏపి శాసన మండలిలో ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేయడంపై టిడిపి సభ్యులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మండలి ప్రత్యక్ష ప్రసారాలను ఎందుకు ఆపేశారు? అంటూ సభలో టిడిపి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లైవ్ ప్రసారాలు ప్రారంభించాకే చర్చ ప్రారంభిద్దామని పట్టుబట్టారు. ప్రత్యక్ష ప్రసారాలపై వైఎస్‌ఆర్‌సిపి తీరును నిలదీస్తున్నారు. వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లులకు మూడు సవరణలను ప్రతిపాదిద్దామని టిడిపి భావిస్తోంది. సాంకేతిక సమస్య తలెత్తిందని గంట సేపట్లో తిరిగి ప్రసారం అవుతాయని వైఎస్‌ఆర్‌సిపి సభ్యులు అంటున్నారు. ప్రత్యక్ష ప్రసారాల్లో సాంకేతిక సమస్య వచ్చిందని, పరిష్కారానికి సిబ్బంది ప్రయత్నిస్తున్నారని ఏపి మంత్రి బొత్స సత్య నారాయణ అన్నారు. రాజ్యాంగ సంక్షోభం వచ్చినట్లుగా టిడిపి రాద్ధాంతం చేస్తోందని పిల్లి సుభాష్ చంద్రబోస్ విమర్శించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/