బుర్కినాఫాసోలో ఉగ్రదాడిలో 36 మంది మృతి

islamic terrorist
islamic terrorist

వాగడూగు: పశ్చిమాఫ్రికా దేశం బుర్కినాఫాసోలోని నగ్రావోగో ప్రాంతంలోని ఓ మార్కెట్‌పై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. మార్కెట్‌పై దాడి జరిపి కాల్పులకు తెగబడ్డారు. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 36 మంది ప్రజలు మరణించినట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది. మార్కెట్‌పై దాడి జరిపిన అనంతరం పక్కనే ఉన్న గ్రామంలోకి వెళ్లిన ముష్కరులు మరో నలుగురిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడుల్లో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రభుత్వం ఈ చర్యను తీవ్రంగా ఖండించింది. ముష్కరుల ఏరివేత కోసం జరుగుతున్న పోరులో ప్రజలు సహకరించాలని అభ్యర్థించింది. అర్హులైన యువకులకు ఆయుధాలు ఇచ్చి శిక్షణనిస్తుంది. కాగా గత నెల బుర్కినాఫాసోలో జరిగిన దాడిలో కనీసం 30 మంది పౌరులు మరిణించిన విషయం తెలిసిందే. గత నాలుగు సంవత్సరాలుగా ఇక్కడ ఇస్లామిక్‌ ఉగ్రవాదులు పంజా విసురుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన ప్రాన్స్‌ సైన్యం ఉగ్రవాద ముఠాలు స్వాధీనం చేసుకున్న అనేక ప్రాంతాల్ని తిరిగి సొంతం చేసుకునేందుకు అక్కడి ప్రభుత్వానికి సహకరిస్తోంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/