సిద్ధం సభలో చంద్రబాబు, పవన్ కటౌట్లపై ఫిర్యాదు

ఏపీలో రా అధికార వైసిపి ఎన్నికలకు ముందు భీమిలి నియోజకవర్గం నుండి సమర శంఖాన్ని పూరించింది. ఎన్నికల ప్రచార పర్వాన్ని ప్రారంభించిన సీఎం జగన్మోహన్ రెడ్డి భీమిలి వేదికగా ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. భారీ బహిరంగ సభను ఏర్పాటుచేసి మూడు లక్షల మంది జన సమీకరణ తో నిర్వహించిన ఈ సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, సిపిఐనేత రామకృష్ణల క్యారికేచర్ కటౌట్లు దర్శనం రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

దీనిపై టీడీపీ , జనసేన శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు, పవన్ను కించపరిచేలా కటౌట్లు ఏర్పాటు చేశారంటూ జనసేన నేతలు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కటౌట్ల ముందు పంచింగ్ బ్యాగ్లు పెట్టి దాడి చేసేలా వైసీపీ కార్యకర్తలను ప్రేరేపించారని తెలిపారు. ప్రచారానికి వెళ్లే తమ నాయకులు, కార్యకర్తలపై ఇలాగే దాడులు చేస్తే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు.