2024లో చంద్రబాబుకు రెస్ట్ తప్పదుః కొడాలి నాని

Chandrababu must rest in 2024 Kodali Nani

అమరావతిః ఇన్నేళ్లుగా చంద్రబాబును గెలిపిస్తున్నారు… ఆయనకు రెస్ట్ ఇద్దాం… ఈ సారి నన్ను గెలిపిస్తారా? అంటూ ఆయన భార్య నారా భువనేశ్వరి కుప్పంలో సరదా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కుప్పంలో ఎన్టీఆర్ క్యాంటీన్ ను ప్రారంభించిన భువనేశ్వరి… ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, సరదాగానే తాను ఈ వ్యాఖ్యలు చేశానని కూడా ఆమె చెప్పారు. అయితే, ఈ వ్యాఖ్యలను వైఎస్‌ఆర్‌సిపి నేతలు తమకు అనుకూలంగా మలుచుకుని సెటైర్లు వేస్తున్నారు.

తాజాగా వైఎస్‌ఆర్‌సిపి నేత కొడాలి నాని స్పందిస్తూ… చంద్రబాబుకు రెస్ట్ ఇవ్వాలని ఆయన భార్యే కోరుతున్నారని… తన మననులో ఉన్న మాటను భువనేశ్వరి బయటపెట్టారని.. ఎన్టీఆర్ బిడ్డ అడిగిన కోరికను మనమంతా గౌరవించాలని… ఐదు కోట్ల ఆంధ్రులం కలిసి చంద్రబాబుకు రెస్ట్ ఇద్దామని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు రెస్ట్ ఇచ్చి భువనేశ్వరికి అప్పచెబుదామని అన్నారు. 2024లో చంద్రబాబుకు పూర్తి స్థాయిలో రెస్ట్ తప్పదని జోస్యం చెప్పారు.