ఏపీలో కొత్తగా మరో 60 కరోనా కేసులు

1,463 కు చేరిన కరోనా బాధితుల సంఖ్య

corona virus
corona virus

అమరావతి; ఏపీ లో కరోనా ఉదృతి మరింతగా పెరిగింది. గత 24 గంటలలో జరిపిన పరీక్షలలో కొత్తగా మరో 60 కేసులు నమోదు అయ్యాయని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీనితో ఏపీ లో కరోనా బాధితుల సంఖ్య 1,463 కు చేరింది. ఒక్కరోజులో 7,902 మంది శాంపిళ్లను పరీక్షించగా, అందులో 60 మందికి పాజిటివ్ నిర్దారణ అయింది. కొత్తగా నమోదు అయిన వాటిలో కర్నూలులో 25, గుంటూరు లో 19, అనంతపురంలో 6, కడపలో 6, విశాఖ లో 2, పశ్చిమ గోదావరిలో 2 కరోనా కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. కాగా ఇప్పటివరకు కరోనా బారిన పడి ఏపీ లో 33 మంది మరణించగా, 403 మంది కోలుకుని డిశార్జ్ అయ్యారు. ప్రస్తుతం మరో 1,027 మంది ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి ; https://www.vaartha.com/news/national/