కర్ణాటకలోవ్యాపార సంస్థలు, మద్యం దుకాణాలు ప్రారంభం!

కంటైన్‌మెంట్ జోన్లు మినహా మిగతా వాటిలో ప్రారంభం కానున్న కార్యకలాపాలు

BS Yediyurappa speaking at an event.
BS Yediyurappa speaking at an event.

కర్ణాటక : కరోనా లాక్‌డౌన్ గడువు ముగియనుండడంతో కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. లాక్‌డౌన్ ముగిసిన అనంతరం మరుసటి రోజు నుంచే షాపింగ్ మాల్స్, మద్యం దుకాణాలతోపాటు ఇతర వ్యాపార సంస్థలను తెరవాలని నిర్ణయించింది. అయితే, కంటైన్‌మెంట్ జోన్లకు మాత్రం ఇది వర్తించదని స్పష్టం చేసింది.గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ఇప్పటికే ఐటీ పరిశ్రమలతోపాటు 15 ప్రభుత్వ విభాగాలు, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు నిర్వహించడం కోసం, దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం ఇక్కడ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. అలాగే, 15వ తేదీ వరకు మెట్రో రైళ్లు, ఆర్టీసీ బస్సులు నడపరాదని కూడా నిర్ణయించినట్టు చెప్పారు. రెడ్ జోన్లయిన బెంగళూరు అర్బన్ తోపాటు 24 కంటైన్‌మెంట్లలో మాత్రం వ్యాపార సంస్థలకు, మాల్స్, సినిమా హాళ్లకు అనుమతి ఉండదని ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప పేర్కొన్నారు. స్పష్టం చేశారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి :
https://www.vaartha.com/news/international-news/