తెలుగు రాష్ట్రాలకు సిఎంల సంక్రాంతి శుభాకాంక్షలు

CM KCR & CM Jagan
CM KCR & CM Jagan

హైదరాబాద్‌: రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల జీవితంలో నిత్యం కాంతులు విరజిమ్మేలా దేవతలు ప్రజలను దీవించాలని తెలంగాణ సిఎం కెసిఆర్‌ ఆకాంక్షించారు. ప్రతీ ఇంటా సుఖ శాంతులు, సౌభాగ్యం, సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని ఆయన కోరారు. సంక్రాంతి పర్వదినాన్ని ప్రజలంతా ఆనందంగా జరుపుకోవాలని సిఎం కెసిఆర్‌ అన్నారు. ఏపి సిఎం జగన్‌మోహన్‌ రెడ్డి కూడా తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలను తెలియజేశారు. సంస్కృతీ సంప్రదాయాలకు తెలుగు ప్రజలు ఇచ్చే గౌరవానికి సంక్రాంతి ప్రతీక అని ఆయన అన్నారు. గత 7 నెలల్లో రైతు సంక్షేమానికి చర్యలు తీసుకున్నామని చెప్పారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతీ కుటుంబం సంక్రాంతి పండుగను సంతోషంగా జరుపుకోవాలని సిఎం జగన్‌ కోరారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/