నేడు టీడీపీ నారీ సంకల్ప దీక్ష

అమరావతి : మంగ‌ళ‌గిరి టీడీపీ కేంద్ర కార్యాల‌యంలో నేడు టీడీపీ మహిళ విభాగం నారీ సంకల్ప దీక్షను చేయనుంది. తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత నేతృత్వంలో జరిగే ఈ దీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటీడీపీకి చెందిన మహిళలు హాజరుకానున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ పార్టీ కార్యాలయంలో ఈ దీక్ష జరగనుంది. వైస్సార్సీపీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, కనీసం దిశ చట్టాన్ని కూడా అమలు చేయలేకపోతున్నారని టీడీపీ ఆరోపిస్తుంది. వ‌రుస‌గా మహిళలపై జ‌రుగుతున్న‌ అత్యాచారాలు, పోలీసుల వైఫల్యాలను నిరసిస్తూ ఈ దీక్షను చేపడుతున్నట్లు వంగలపూడి అనిత తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/