శబరిమల రివ్యూ పిటిషన్లపై సుప్రీంలో విచారణ

supreme court
supreme court

న్యూఢిల్లీ: శబరిమల వివాదంపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. శబరిమల తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్ల విచారణ సందర్భంగా ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం సిఫార్సు చేసిన అంశాలను పరీశీలిస్తున్నామని సీజేఐతో కూడిన ధర్మాసనం తెలిపింది. ఈ క్రమంలో రివ్యూ పిటిషన్లపై విచారణ జరిపే ధర్మాసనంలో ఉండబోయే న్యాయమూర్తుల పేర్లను సుప్రీం కోర్టు ఇదివరకే ప్రకటించింది. ఇందులో సుప్రీం కోర్టు సీజే బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనంలో న్యాయమూర్తులు ఆర్‌.భానుమతి, అశోక్‌ భూషణ్‌, ఎల్‌. నాగేశ్వర రావు, మోహన్‌ ఎం. శంతన గౌడర్‌, ఎస్‌. అబ్దుల్‌ నజీర్‌, ఆర్‌. సుభాష్‌ రెడ్డి, బి.ఆర్‌. గవారు, సూర్యకాంత్‌ సభ్యులుగా ఉన్నారు.ఇందు మల్హోత్రా, ఎ.ఎం. ఖన్విల్కర్‌, రోహిన్టన్‌ నారీమన్‌, డి.వై. చంద్రచూడ్‌ తదితరులు ఈ ధర్మాసనంలో లేరు.

10-50 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళల ఆలయ ప్రవేశాన్ని అడ్డుకోవడాన్ని కొట్టివేస్తూ ఇచ్చిన తీర్పుపై జస్టిస్‌ ఇందు మల్హోత్ర మాత్రమే అసమ్మతి వ్యక్తం చేశారు.ఈ అంశాన్ని అతి పెద్ద రాజ్యాంగ ధర్మాసనం పరిశీలనకు పంపాలన్న నవంబరు 14, 2019 నాటి మెజార్టీ నిర్ణయంపై అసమ్మతి తెలిపిన వారిలో జస్టిస్‌ నారిమన్‌, జస్టిస్‌ చంద్రచూడ్‌లు ఉన్నారు. చట్ట నిబంధనలు పాటిస్తూ మహిళా సందర్శకులకు రక్షణ కల్పించాలని జస్టిస్‌ నారిమన్‌ కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/