షర్మిల కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

TSPSC పేపర్ లీక్ వ్యవహారంలో సిట్ అధికారులను కలిసే ప్రయత్నం చేసిన YSRTP అధ్యక్షురాలు షర్మిలను పోలీసులు అడ్డుకోవడం.. ఈ క్రమంలో షర్మిల ఓ మహిళా పోలీసుపై చేయి చేసుకోవడం, మరో పోలీసు అధికారిని నెట్టివేయడం జరిగిన సంగతి తెలిసిందే. డ్యూటీ లో ఉన్న పోలీసులపై చేయి చేసుకున్న కారణంగా షర్మిల ఫై ఐపీసీ 353 , 330 సెక్షన్ల కింద అరెస్ట్ చేసారు. ఈ దాడిలో షర్మిల కారు డ్రైవర్ ను సైతం పోలీసులు అరెస్ట్ చేసారు.

కానిస్టేబుల్ కాలి పైకి కారు ఎక్కించిన కేసులో అతనిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల్లో షుగర్ 502 వచ్చింది. కానిస్టేబుల్ గిరిబాబు కాలి పైకి కారు ఎక్కించడంతో కాలి లెగ్మెంట్ కు గాయమైంది. దీంతో డ్రైవర్ ను కూడా అరెస్ట్ చేశారు. ఈ కేసులో షర్మిలను ఏ 1గా, డ్రైవర్ బాలును ఏ2గా, మరో డ్రైవర్ జాకబ్ ను ఏ3గా నమోదు చేశారు. బాలును ముందే అరెస్ట్ చేయగా, జాకబ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పుడు అతనిని అరెస్ట్ చేశారు.