నామినేష‌న్ దాఖ‌లు చేసిన సీఎం జ‌గ‌న్‌

వైసీపీ అధినేత‌, సీఎం జగన్ పులివెందుల వైసీపీ అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. పులివెందుల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ వైయ‌స్ అవినాష్‌రెడ్డి పాల్గొన్నారు. అంతకు ముందు పులివెందుల సీఎస్ఐ గ్రౌండ్‌లో బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్రసంగించారు.

పులివెందుల అంటే అభివృద్ధి, నమ్మకం, ఒక సక్సెస్‌ స్టోరీ. ఈ అభివృద్ధికి కారణం మహానేత వైయస్‌ఆర్, ఆయన బిడ్డగా వైయస్‌ఆర్‌ బాటలో మరో రెండు అడుగులు ముందుకు వేసింది మీ బిడ్డ జగన్‌ ప్రభుత్వం. పులివెందులలో ఏం ఉంది? అనే స్థాయి నుంచి పులివెందులలో ఏం లేదు? అనే స్థాయికి చేరుకున్నాం. అందుకే పులివెందుల ఒక విజయగాథ. మంచి చేయడం మన కల్చర్‌.. మంచి మనసు మన కల్చర్‌.. మాట తప్పకపోవడం మన కల్చర్‌.. బెదిరింపులకు లొంగకపోవడం మన కల్చర్‌’’ అంటూ జగన్ భారీ డైలాగ్స్ తో కార్యకర్తల్లో జోష్ నింపారు. అలాగే టీడిపి , బిజెపి , జనసేన , కాంగ్రెస్ పార్టీల అధినేతల ఫై విమర్శలు కురిపించారు. ఇక ఎంపీ అవినాష్ రెడ్డి చాల అమాయకుడు , పిల్లవాడు..ఆయన రాజకీయ జీవితం నాశనం చేయాలనీ చెల్లెమ్మలు కుట్ర చేస్తున్నారంటూ పరోక్షంగా షర్మిల , సునీతల ఫై జగన్ ఆరోపణలు చేసాడు.