జ్ఞానవాపి మసీదులో ప్రారంభమైన శాస్త్రీయ సర్వే

Survey underway at Gyanvapi premises amid tight security, Muslim side boycotts

వారణాసిః ఉత్తరప్రదేశ్‌ వారణాసిలోని ప్రఖ్యాత కాశీ విశ్వనాథ ఆలయ సమీపంలో ఉన్న వివాదాస్పద జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో సైంటిఫిక్ సర్వేను ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా శుక్రవారం ఉదయం ప్రారంభించింది. ఉదయం 7 గంటలకే మసీదు ప్రాంగణానికి చేరుకున్న భారత పురావస్తు శాఖ అధికారులు గట్టి భద్రత మధ్య శాస్త్రీయ సర్వే ప్రారంభించారు. మధ్యాహ్నం 12 గంటల వరకు సర్వే కొనసాగనుంది. ఆ తర్వాత మళ్లీ మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటలకు వరకు సర్వే చేపట్టనున్నారు. 17వ శతాబ్దంనాటి ఈ మసీదును అంతకన్నా ముందే నిర్మించిన హిందూ దేవాలయంపైన నిర్మించారా? అనే అంశాన్ని నిర్థరించేందుకు ఈ సర్వే జరుగుతోంది. కాగా, మసీదు కమిటీ సభ్యులు ఈ సర్వేను బహిష్కరించారు.