సన్‌రైజర్స్ హైదరాబాద్ కొత్త కెప్టెన్‌గా ఐడెన్ మార్‌క్రమ్

సన్ రైజర్స్ హైదరాబాద్ కొత్త కెప్టెన్ గా మార్క్రమ్ ను నియమిస్తున్నట్లు ఎస్ ఆర్ హెచ్ యాజమాన్యం కాసేపటి క్రితం ప్రకటించింది. మయాంక్ అగర్వాల్ పేరు పరిశీలనలో ఉన్నప్పటికీ… చివరికి మార్క్రమ్ వైపు ముగ్గు చూపింది సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సందడి షురూ అయింది. టీంల వారిగా ఆటగాళ్ల ఎంపిక పూర్తికావటంతో పాటు, ఆయా టీంల యాజమాన్యాలు జట్టు కెప్టెన్లను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ కొత్త కెప్టెన్‌ ప్రకటించింది. గత సీజన్‌లో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ విలియమ్సన్ నుండి మార్‌క్రమ్ బాధ్యతలు స్వీకరించాడు. ఈ నెల ప్రారంభంలో జరిగిన వేలంలో సన్ రైజర్స్ జట్టు ఐడెన్ మార్‌క్రమ్ ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. మార్క్రమ్ ఙ‌టీవలే సౌత్ ఆఫ్రికా 20-20 లీగ్ లో సన్రైజర్స్ ఈస్టర్న్‌ జట్టుకు కెప్టెన్ గా వహించి టైటిల్ కూడా అందించాడు.

ఆల్ రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టాడు మార్క్రమ్. దీంతో మార్క్రమ్ కే సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్సీ పగ్గాలను యాజమాన్యం కట్టబెట్టింది. సన్‌రైజర్స్ జట్టుకు కన్నేళ్లు పాటు డేవిడ్ వార్నర్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ తరువాత కేన్ విలియమ్సన్ జట్టును నడిపించారు. ప్రస్తుత సీజన్‌లో ఆ ఇద్దరు జట్టులో చోటు దక్కించుకోలేదు. ఇదిలాఉంటే ఐపీఎల్ 16వ ఎడిషన్ మార్చి 31న ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచ్ ను ఏప్రిల్ 2న రాజస్థాన్ రాయల్స్ తో ఆడుతుంది.